వింత జంతువు విధ్వంసం

వింత జంతువు విధ్వంసం

కటక్‌ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గొర్రెలు కుప్పలు తెప్పలుగా మరణిస్తున్నాయి. ఆకస్మిక రోగ సంక్రమణ కాదు. అస్పష్టమైన దాడితో ఈ జీవులు అకారణంగా మరణిస్తున్నట్టు గ్రామంలో తీవ్ర భయాందోళనల చోటు చేసుకున్నాయి. శాలలో కట్టి ఉంచిన గొర్రెలపై ఈ దాడులు జరుగుతున్నాయి. గొర్రెల్ని చీల్చి చెండాడి చంపేస్తున్నట్టు వాస్తవ దృశ్యాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఇదంతా మానవ కృత్యమా? అదృశ్య శక్తి దాడులా? క్షుద్ర శక్తుల ప్రయోగమా? కక్షదార్ల కుట్రా? ఇలా పలు సందేహాలతో నియాలి గ్రామస్తులు తల్లడిల్లుతున్నారు. విష ప్రయోగం అయితే కానే కాదని స్పష్టం అయిపోయింది.

సోషల్‌ వైరల్‌
ఈ పరిస్థితుల్లో అద్భుత రూపం దాల్చిన జీవి గొర్రెల్ని హతమార్చుతుందనే సోషల్‌ మీడియా వైరల్‌ బలం పుంజుకుంది. మేక పోతు రూపంతో ముఖం మినహా శరీరం అంతా మానవ ఆకృతి కలిగి(నర మేక) ఉన్నట్టు ఈ ప్రసారం దుమారం రేపింది. ఈ ప్రసారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర పశు సంవర్థక విభాగం మంత్రి డాక్టర్‌ దామోదర్‌ రౌత్‌ తెలిపారు. ఇదంతా దుమ్ములగొండి దాడి అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దాడి చోటు చేసుకున్న శాల పరిసరాల్లో కొన్ని అంతు చిక్కని పాద ముద్రల్ని గుర్తించారు. దాడులకు గురైన శాలల్ని పరిశీలించారు. ఏదో జంతువు ఈ చర్యకు పాల్పడుతున్నట్లు ఈ ఛాయలు స్పష్టం చేస్తున్నాయి. దాడుల్లో కొన్ని గొర్రెలు అదృష్టవశాత్తు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడుతున్నాయి. వీటిపై మిగిలిన ఆనవాళ్ల ప్రకారం గుర్తు తెలియని జంతువు బలంగా కరిచి గాయపరిచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదో జంతువు మాత్రమే దాడులకు పాల్పడుతున్నట్టు విజ్ఞుల అభిప్రాయం. అదేమిటో స్పష్టం కావలసి ఉంది.

 

సీసీటీవీ కెమెరాలతో నిగ్గు తేల్చుతాం: చీఫ్‌ కంజర్వేటరు
నియాలి ప్రాంతంలో గొర్రెలపై దాడులకు సంబంధించి బలపడిన అపోహల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సి ఉంది. అభూత కల్పనతో పేరుకుపోయిన భయాందోళనల్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ సంరక్షక విభాగం ప్రధాన అధికారి పీసీసీఎఫ్‌ ఎస్‌.ఎస్‌.శ్రీవాస్తవ తెలిపారు. ఈ దాడుల నిగ్గు తేల్చేందుకు ప్రభావిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్ని అమర్చేందుకు నిర్ణయించినట్టు మంగళవారం ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో 5 చోట్ల సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. భయాందోళన కలిగిస్తున్న జంతువుని గుడా రం నుంచి బయటకు రప్పించేందుకు బాణసంచ కా ల్చి దుమారం రేపుతారు. అంతకు ముందే పరిసర ప్రా ంతాల్లో వల పన్ని జంతువు పని పడతామని ఆయన వివరించారు. పరిస్థితులపై నిఘా వేసేందుకు అటవీ సంరక్షణ విభాగం 3 ప్రత్యేక స్క్వాడ్‌ల్ని నియమించింది. గొర్రెల శాలల్లో రాత్రి పూట దీపాలు వెలిగించేందుకు సంబంధీకులకు సలహా జారీ చేశారు. మృత గొర్రెల దేహ నమూనాల్ని పశువుల రోగాలు, పరిశోధన సంస్థ సేకరించి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తుంది.


Posted On: 28 Jun 2017 Total Views: 584సలామ్‌ హలీమ్‌!

సలామ్‌ హలీమ్‌!

సుల్తాన్‌ గారింటికి విందుకు వెళ్లి వచ్చావట. అదృష్టవంతుడివి. ఇంతకీ విందు ఎలా ఉంది చెప్పవేం..?’ ‘చాలా బాగుంది. ఎన్నో పదార్థాలు వడ్డించారు. అన్నీ బాగున్నాయి. ఒక్కటి మాత్రం..’ ‘ఆ.. ఒక్కటి మాత్రం? బాగా లేదా? సుల్తాన్‌ ఇంట్లో వంటకం బాగోకపోవడమా..!’ ‘అలా తొందరపడ...

17 Jun 2017

కాకులకు రాచమర్యాదలు...!

కాకులకు రాచమర్యాదలు...!

ఇంటి దగ్గర కాకులు అరిస్తే ఓపికుంటే గుప్పెడు మెతుకులు వేస్తాం లేదంటే అవతలకి తోలేస్తాం. కానీ అక్కడ బొంత కాకులకు రాచమర్యాదలు జరుగుతాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. లండన్‌లోని థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’లో ఏడు కాకులు ఉంటాయి. వాటిని కం...

17 Jun 2017