సలామ్‌ హలీమ్‌!

సలామ్‌ హలీమ్‌!

సుల్తాన్‌ గారింటికి విందుకు వెళ్లి వచ్చావట. అదృష్టవంతుడివి. ఇంతకీ విందు ఎలా ఉంది చెప్పవేం..?’

‘చాలా బాగుంది. ఎన్నో పదార్థాలు వడ్డించారు. అన్నీ బాగున్నాయి. ఒక్కటి మాత్రం..’

‘ఆ.. ఒక్కటి మాత్రం? బాగా లేదా? సుల్తాన్‌ ఇంట్లో వంటకం బాగోకపోవడమా..!’

‘అలా తొందరపడకు. బాగోలేదని ఎవరన్నారు? అద్భుతంగా ఉందంటున్నా..’

‘అలాగా! ఏమిటది? నేతి మిఠాయా?’

‘మిఠాయి కాదు... తియ్యగా లేదు. అలాగని కారమూ కాదు... కూరా కాదు, చారూ కాదు..’

‘మరేమిటి? అలా వూరించక సరిగా చెబుదూ..’

‘ఏమిటో తెలియదు. కానీ తింటుంటే అలా తింటూనే ఉండాలనిపించింది. చిక్కగా, కొంచెం ఘాటుగా, కొంచెం సాగుతూ, నములుతుంటే మాంసం రుచి తగులుతున్నట్లు... అలాగని మళ్లీ అందులో మాంసం ముక్కేం కనపడలేదనుకో... దేనితో చేశారో తెలియలేదు కానీ రుచికి మాత్రం అద్భుతంగా ఉందనుకో. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోంది.’

అసలే విందుకు తనకు ఆహ్వానం లభించలేదన్న బాధ. ఇక ఈ వర్ణన ఆ బాధను ఇంకెంత తీవ్రం చేసి ఉంటుందో వూహించండి. అవును... 1930ల నాటి సంగతిది. నిజాం రాజ్యంలో ఒక అధికారి సుల్తాన్‌ సైఫ్‌ నవాజ్‌ జంగ్‌. ఆయన పూర్వీకులు యెమన్‌ రాజకుటుంబీకులు.

ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అప్పుడప్పుడు తమ ప్రత్యేక వంటలతో అతిథులను అలరించడం ఆయనకు అలవాటు. వారింట విందుకు ఆహ్వానం లభిస్తే జన్మ ధన్యమైనట్లే భావించేవారు స్థానికులు. అక్కడ వడ్డించిన ఓ ప్రత్యేక వంటకాన్ని మాత్రం పదికాలాల పాటు గుర్తుపెట్టుకునేవారు. అడిగినవారికీ అడగనివారికీ వర్ణించి చెప్పేవారు. ఆ వర్ణన విని అదేమిటో తేల్చుకోలేక ఆ నవాబు గారింట ఆతిథ్యం పొందడానికి తమకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూసేవారట చాలామంది.

ఇప్పుడు మనకా ఎదురు చూపులు అక్కర్లేదు. అప్పుడే కాదు ఇప్పటికీ ఎప్పటికీ నోరూరించే ఆ వంటకమే హలీమ్‌. ఆన్‌లైన్లో ఆర్డరిస్తే నిమిషాల్లో వేడి వేడిగా మనముందు ప్రత్యక్షమవుతుంది. అరబ్‌, పర్షియన్‌ సేనలతో పాటు అరబిక్‌ ఎడారుల మీదుగా ప్రయాణించి హైదరాబాద్‌ చేరిన ఈ హలీమ్‌ వెనకాల పెద్ద కథే ఉంది. విదేశాలనుంచీ వచ్చినవారితోపాటు వారి వంటలూ ఆహారపుటలవాట్లూ కూడా స్థానిక సంస్కృతితో మమేకమయ్యాయి. అసఫ్‌ జాహీల కాలం నుండీ హలీమ్‌ వంటకం అంతఃపురాల్లో తయారవుతున్నా అది బయటి ప్రజల్లోకి వచ్చింది మాత్రం 1930 దశకం తర్వాతే. అరబ్బులు దీన్ని హరీస్‌ అనీ హరిషా అనీ అనేవారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన నిజాం రాజులది విలాసవంతమైన జీవనశైలి. వివిధ దేశాలనుంచీ గొప్ప గొప్ప వంటవాళ్లను రప్పించేవారు. ప్రభువులను మెప్పించడానికి వారు పోటీలు పడి నోరూరించే వంటలను తయారుచేసేవారు. అలాంటి వాటిలో హలీమ్‌ ఒకటి. ఇక్కడి వారి అభిరుచులకు తగినట్లుగా సుల్తాన్‌ నవాజ్‌ జంగ్‌ హలీమ్‌ తయారీలో వాడే సుగంధద్రవ్యాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఆయన ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిందే ఇప్పటి హైదరాబాదీ హలీమ్‌. కారం, చింతపండు వాడని ఏకైక హైదరాబాదీ వంటకం. నిమ్మచెక్క, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుపండ్లను కేవలం అలంకరణ(గార్నిషింగ్‌)కి వాడతారు. ఇతర దక్కనీ వంటకాలన్నీ తెలంగాణ ప్రాంత ఆహారపుటలవాట్ల ప్రభావానికి లోను కాగా హలీమ్‌ మాత్రం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. అరబ్బుల హలీమ్‌లో గరమ్‌ మసాలా ఎక్కువ. హైదరాబాదీ హలీమ్‌లో అవి తక్కువే.


Posted On: 17 Jun 2017 Total Views: 463


వింత జంతువు విధ్వంసం

వింత జంతువు విధ్వంసం

కటక్‌ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గొర్రెలు కుప్పలు తెప్పలుగా మరణిస్తున్నాయి. ఆకస్మిక రోగ సంక్రమణ కాదు. అస్పష్టమైన దాడితో ఈ జీవులు అకారణంగా మరణిస్తున్నట్టు గ్రామంలో తీవ్ర భయాందోళనల చోటు చేసుకున్నాయి. శాలలో కట్టి ఉంచిన గొర్రెలపై ఈ దాడులు జరుగుతున్నాయి. గొర్రెల్ని చీల్చి చెండాడి చంప...

28 Jun 2017


కాకులకు రాచమర్యాదలు...!

కాకులకు రాచమర్యాదలు...!

ఇంటి దగ్గర కాకులు అరిస్తే ఓపికుంటే గుప్పెడు మెతుకులు వేస్తాం లేదంటే అవతలకి తోలేస్తాం. కానీ అక్కడ బొంత కాకులకు రాచమర్యాదలు జరుగుతాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. లండన్‌లోని థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’లో ఏడు కాకులు ఉంటాయి. వాటిని కం...

17 Jun 2017