కాకులకు రాచమర్యాదలు...!

కాకులకు రాచమర్యాదలు...!

ఇంటి దగ్గర కాకులు అరిస్తే ఓపికుంటే గుప్పెడు మెతుకులు వేస్తాం లేదంటే అవతలకి తోలేస్తాం. కానీ అక్కడ బొంత కాకులకు రాచమర్యాదలు జరుగుతాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. లండన్‌లోని థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’లో ఏడు కాకులు ఉంటాయి. వాటిని కంటికిరెప్పలా చూసుకోడానికి పనివాళ్లూ ఉంటారు. రోజూ వాటికి తాజా మాంసం, కోడిగుడ్లూ, జున్నూ, పండ్లను ఆహారంగా ఇస్తారు. వాటి ఆరోగ్యాన్నీ ఎప్పటికప్పుడు పరీక్షిస్తారు. ఇదంతా ఎందుకంటే... ఆ కాకులు కోటను విడిచి వెళితే కోట పడిపోతుందనీ, రాజ్యానికి విపత్తు వాటిల్లుతుందనీ జ్యోతిష్కుడు సెలవిచ్చాడట. అందుకే కొన్ని శతాబ్దాలుగా ఆ కోటలో కాకులకు అలా రాచమర్యాదలు జరుగుతున్నాయి. కోటను చూడ్డానికి వచ్చే సందర్శకులు కాకుల రాజభోగాలనూ చూసి ఎంతో ఆశ్చర్యపోతుంటారు. పదిహేనో శతాబ్దంలో - నాటి చక్రవర్తి తన శత్రువులను కోటకు తీసుకొచ్చి హతమార్చేవాడట. ఆ శవాల వాసనకు మొదట్లో కాకులు కోటకు రావడం మొదలుపెట్టాయి. రెండు శతాబ్దాల తరువాత అప్పటి రాజు రెండో ఛార్లెస్‌ కోటలో కాకుల అలజడి ఇబ్బందిగా ఉండటంతో వాటిని చంపేయమని ఆజ్ఞాపించాడు. కానీ కోటలో కాకులు లేకుండాపోతే కోట కూలిపోతుందనీ, రాజ్యానికీ అరిష్టమనీ జ్యోతిష్కుడు చెప్పడంతో అప్పటినుంచీ ఏడు కాకులను ప్రత్యేక ఏర్పాట్ల మధ్య పెంచడం మొదలుపెట్టారు.అవి ఆరోగ్యంగా ఉంటేనే కోటకూ రాజ్యానికీ ఎలాంటి ముప్పూ వాటిల్లదని ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారట.


Posted On: 17 Jun 2017 Total Views: 465


వింత జంతువు విధ్వంసం

వింత జంతువు విధ్వంసం

కటక్‌ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గొర్రెలు కుప్పలు తెప్పలుగా మరణిస్తున్నాయి. ఆకస్మిక రోగ సంక్రమణ కాదు. అస్పష్టమైన దాడితో ఈ జీవులు అకారణంగా మరణిస్తున్నట్టు గ్రామంలో తీవ్ర భయాందోళనల చోటు చేసుకున్నాయి. శాలలో కట్టి ఉంచిన గొర్రెలపై ఈ దాడులు జరుగుతున్నాయి. గొర్రెల్ని చీల్చి చెండాడి చంప...

28 Jun 2017


సలామ్‌ హలీమ్‌!

సలామ్‌ హలీమ్‌!

సుల్తాన్‌ గారింటికి విందుకు వెళ్లి వచ్చావట. అదృష్టవంతుడివి. ఇంతకీ విందు ఎలా ఉంది చెప్పవేం..?’ ‘చాలా బాగుంది. ఎన్నో పదార్థాలు వడ్డించారు. అన్నీ బాగున్నాయి. ఒక్కటి మాత్రం..’ ‘ఆ.. ఒక్కటి మాత్రం? బాగా లేదా? సుల్తాన్‌ ఇంట్లో వంటకం బాగోకపోవడమా..!’ ‘అలా తొందరపడ...

17 Jun 2017