వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ హీరోను ఫిక్స్ చేసిన జ‌గ‌న్

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ ...

2019 ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏపీ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచే కాక పుట్టిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు ఆ పార్టీ అధ్య‌క్షుడు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఇప్ప‌టికే వైసీపీ ఎన్నిక‌ల వ్యూహక‌ర్త‌గా ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ను నియ‌మించిన జ‌గ‌న్.. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో ఎన్నిక‌ల‌కు స‌ర్వ స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు..

ఏపీలో అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు వ్య‌తిరేక‌త పెరిగిపోతుంద‌నేది జోరుగా వినిపిస్తున్న వార్త‌.. ప్ర‌భుత్వ అస‌మ‌ర్ద నిర్ణ‌యాలు, అవినీతి పాల‌న‌, ఎమ్మెల్యేల భూకుంభ‌కోణాల‌తో టీడీపీపై ప్ర‌జ‌ల్లో పూర్తి వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకునేంద‌కు ప్ర‌య‌త్నాలు చేస్తోంది వైసీపీ.. ఈ మేర‌కు పాద‌యాత్రకు శ్రీకారం చుట్టిన జ‌గ‌న్.. ఏపీలో అక్టోబ‌ర్ 27 నుంచి 3 వేల కిలోమీట‌ర్ల భారీ పాద‌యాత్ర చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా వైసీపీ ప్లీన‌రీలో జ‌గ‌న్ ముందుగానే ప్ర‌క‌టించిన‌ న‌వ‌ర‌త్నాల హామీలకు ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని చెప్ప‌వ‌చ్చు.

అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితుల్లోనైనా విజ‌య‌కేతం ఎగ‌ర‌వేయాల‌ని భావించిన జ‌గ‌న్.. బ్ర‌హ్మాస్త్రాల‌ను సిద్దం చేస్తున్నారు.. ఉన్న అవ‌కాశాల‌న్నిటిని ఉప‌యోగించుకోవాల‌ని భావించారు. ఇందులో భాగంగా సినీ గ్లామ‌ర్ పై ఫోక‌స్ పెట్టిన జ‌గ‌న్.. సినీ ప్ర‌ముఖుల‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తున్నార‌ని తెలుస్తోంది.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను వైసీపీలోకి తీసుకొచ్చి, విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయించాల‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌నేది లోట‌స్ పాండ్ వ‌ర్గాల నుంచి బ‌లంగా వినిపిస్తున్న వార్త‌.. కృష్ణ‌ను వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్య‌త‌ను ఆయ‌న సోద‌రుడు వైసీపీ నేత ఆదిశేష‌గిరిరావుకు జ‌గ‌న్ అప్ప‌గించార‌నే విష‌యం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ క్ర‌మంలో మ‌రో వార్త వైసీపీ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. వైసీపీకి ప్ర‌చార‌క‌ర్త‌ను నియ‌మించార‌నే ఆలోచ‌న‌కు జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లు లోట‌స్ పాండ్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా గ‌త కొద్ది రోజుల క్రితం నాగార్జునను, స్వ‌యంగా క‌లిసిన‌ జ‌గ‌న్ వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార‌క‌ర్త‌గా ఉండాల‌ని కోరార‌ట‌.. దాంతో మీరు ఇంత చిన్న విష‌యానికి ఇంతలా అడ‌గాల్సిన అవ‌స‌రం లేదు. త‌ప్ప‌క స‌హాయం చేస్తానని నాగార్జున అన్న‌ట్లు వైసీపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

నాగార్జున వైసీపీలోకి వ‌స్తార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ కు, నాగార్జునకు వ్యాపార పరంగా కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. దివ‌గంత సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి, వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డికి, కూడా నాగార్జున మంచి మిత్రుడు. అగ్ర‌హీరోగా నాగార్జున‌కు ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. దీంతో నాగార్జున‌ను ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మించ‌డానికి సుముఖంగా ఉన్నార‌ట వైసీపీ నేత‌లు.. గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ ప‌థ‌కాల‌ను ఫ్రీ ప‌బ్లిసిటీ చేశారు నాగార్జున‌.. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తున్న జ‌గ‌న్.. వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార‌క‌ర్త‌గా నాగార్జునను ఉప‌యోగించుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు, వైసీపీ శ్రేణుల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.


Posted On: 29 Jul 2017 Total Views: 4763

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో...

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో చేతులు కల...

నెల్లూరులోనే కాదు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఎమ్యెల్యే అనిల్ యాదవ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని విషయం అందరికి తెలిసిందే.జగన్ పై విమర్శలు చేసిన వారిపై అదే స్థాయిలో ప్రతి విమర్శా చేయడంలో అనిల్ యాదవ్ అందెవేసిన చెయ్యి . వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్-బ్రాండ్ లిస్ట్ లో రోజా , కొడాలి నాని తో పాటు...

26 Aug 2017

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, ప్ర‌ముఖ సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్య...

30 Jul 2017

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి ...

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి చెబుతుంది?

నంద్యాలలో రేపు టీడీపీ కి వచ్చే ఓట్లలో 10 శాతం ఓట్లు తీసేస్తే వచ్చే ఓట్లు నిజంగా TDP ఓట్లు.సహజంగా అధికార పార్టీ ఉప ఎన్నికల్లో అనేక వరాలు ప్రకటించి, డబ్బు పంచి అదనంగా 10 శాతం ఓట్లు తెచ్చుకొంటుంది ( ఇదే విషయాన్నీ బాబు దోస్త్ ఆంధ్ర జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకులో రాసాడు)దేశ వ్యాప్తంగా ఉప...

29 Jul 2017


తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున...

తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున్న బాబు..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఆశ్చర్యకరంగా విస్మయకరంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి అంజాద్ బాషా అన్నారు. నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా చంద్రబాబ...

29 Jul 2017

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బా...

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బాయ్‌…

ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో టీడీపీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.గ‌త కొన్ని రోజులుగా పిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌,క‌ర‌నం బ‌ల‌రాంమ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే బ‌గ్గుమంటోంది.ముందొచ్చిన చెవులు కంటె వెన‌కొచ్చిన కొమ్ములు వాడి అ...

28 Jul 2017

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీల మ‌ధ్యే కాదు, మీడియాలోను అదిరిపోయే రేంజ్‌లో వార్ జ‌ర‌గ‌నుంది. మ‌న తెలుగు మీడియా పార్టీల ప‌రంగా ఎప్పుడో చీలిపోయింది. వారి ఈక్వేష‌న్ల‌ను బ‌ట్టి త‌మ‌కు న‌చ్చే పార్టీకి వారు కొమ్ము కాస్తుంటారు. మ‌న త...

28 Jul 2017