జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

జ‌గ‌న్ పై పోసాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, ప్ర‌ముఖ సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేయాలని చిరంజీవి అడిగినట్టు... ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అడిగితే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు పోసాని దిమ్మ‌తిరిగే స‌మాధాన‌మిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన వద్దకు వచ్చి నాయనా.. రాజా.. పోసానీ.. నువ్వు బీజేపీ తరపున ప్రచారం చేస్తే నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. తాను మాత్రం జగన్‌కి ప్రచారం చేస్తాన‌ని పోసాని స్ప‌ష్టం చేశారు . తనను ఎవరు ప్రలోభపెట్టినా.. ఏం చేసినా..... డబ్బు, పదవి ఏమిస్తానన్నా.. తన ఓటు మాత్రం జగన్ మోహ‌న్ రెడ్డికే వేస్తాన‌ని, జగన్‌కే ప్రచారం చేస్తానన్నారు పోసాని.

ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరుగుండదని, తన వ్యక్తిత్వమే అలాంటిదన్న‌ పోసాని, పదవి ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా తనకు అక్కర్లేదని చెప్పారు. జగన్ పోటీ చేయమన్నా చేయనని పోసాని స్పష్టం చేశాడు. తన మాటకు తిరుగులేదని.. మాట మారుస్తాననే డౌట్ వుంటే.. తన మాటలు రికార్డు చేసి పెట్టుకోవాలని ఆయ‌న సూచించారు. ఎవరేమీ చెప్పినా జగన్‌కే తన సపోర్ట్ అంటూ పోసాని వ్యాఖ్యానించ‌డం అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి చిలుక‌లూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన పోసాని.. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న ప‌త్తిపాటి పుల్లారావు చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌డంతో ఆ త‌ర్వాత నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న పోసాని... సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బుల్లితెర‌పై కూడా కొన్ని ప్రొగ్రామ్స్ చేస్తున్నారు పోసాని.


Posted On: 30 Jul 2017 Total Views: 2592





అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో...

అనిల్ యాదవ్ ని ఎదుర్కోలేక నారా లోకేష్ తో చేతులు కల...

నెల్లూరులోనే కాదు ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఎమ్యెల్యే అనిల్ యాదవ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని విషయం అందరికి తెలిసిందే.జగన్ పై విమర్శలు చేసిన వారిపై అదే స్థాయిలో ప్రతి విమర్శా చేయడంలో అనిల్ యాదవ్ అందెవేసిన చెయ్యి . వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్-బ్రాండ్ లిస్ట్ లో రోజా , కొడాలి నాని తో పాటు...

26 Aug 2017

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి ...

AP లో TDP బలమెంత? నంద్యాల ఉప ఎన్నిక ఏమి చెబుతుంది?

నంద్యాలలో రేపు టీడీపీ కి వచ్చే ఓట్లలో 10 శాతం ఓట్లు తీసేస్తే వచ్చే ఓట్లు నిజంగా TDP ఓట్లు.సహజంగా అధికార పార్టీ ఉప ఎన్నికల్లో అనేక వరాలు ప్రకటించి, డబ్బు పంచి అదనంగా 10 శాతం ఓట్లు తెచ్చుకొంటుంది ( ఇదే విషయాన్నీ బాబు దోస్త్ ఆంధ్ర జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకులో రాసాడు)దేశ వ్యాప్తంగా ఉప...

29 Jul 2017

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ ...

వైసీపీ ప్ర‌చార‌క‌ర్త‌గా టాలీవుడ్ స్టార్ హీరోను ఫిక...

2019 ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏపీ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచే కాక పుట్టిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా.. ప్ర‌తిప&zwn...

29 Jul 2017


తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున...

తనే పరీక్ష రాసి.. తనే పేపర్ దిద్దుకుంటున్న బాబు..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు ఆశ్చర్యకరంగా విస్మయకరంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి అంజాద్ బాషా అన్నారు. నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా చంద్రబాబ...

29 Jul 2017

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బా...

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బాయ్‌…

ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో టీడీపీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.గ‌త కొన్ని రోజులుగా పిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌,క‌ర‌నం బ‌ల‌రాంమ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే బ‌గ్గుమంటోంది.ముందొచ్చిన చెవులు కంటె వెన‌కొచ్చిన కొమ్ములు వాడి అ...

28 Jul 2017

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీల మ‌ధ్యే కాదు, మీడియాలోను అదిరిపోయే రేంజ్‌లో వార్ జ‌ర‌గ‌నుంది. మ‌న తెలుగు మీడియా పార్టీల ప‌రంగా ఎప్పుడో చీలిపోయింది. వారి ఈక్వేష‌న్ల‌ను బ‌ట్టి త‌మ‌కు న‌చ్చే పార్టీకి వారు కొమ్ము కాస్తుంటారు. మ‌న త...

28 Jul 2017