మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా గూగుల్‌లో వెతకండిలా..!

మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా గూగుల్‌లో వెతకం...
స్మార్ట్‌ ఫోన్‌ మన జీవితంలో అంతర్భాగమైపోయింది. ప్రతి పనికీ నేనున్నానంటూ గుప్పెట్లోకి తీసుకుంది. పేరులో ఉన్నట్టే స్మార్ట్‌ పనివిధానంతో దూసుకుపోతోంది. ఫొటోలు, వీడియోలు.. ఇలా ప్రతిఒక్కరూ తమ జ్ఞాపకాలను ఇందులోనే నిక్షిప్తం చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే స్మార్ట్‌ ఫోన్‌ కూడా విలువైనదిగా మారిపోయింది. అందుకే... పర్సు పోయినా బాధపడనివారు కూడా స్మార్ట్‌ ఫోన్‌ పోతే ప్రాణం పోయినంత బాధపడతుంటారు. మనం పదిలంగా చూసుకునే స్మార్ట్‌ ఫోన్‌ పోతే ఇంతకీ ఏం చేయాలి? పోయిన మొబైల్‌ను వెతికి పట్టుకోవడం సాధ్యమేనా? అంటే.. అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. గూగుల్‌లోని కొన్ని ప్రత్యేక ఫీచర్స్‌తో ఫోన్‌ను ట్రేస్‌ చేయవచ్చు అని చెబుతున్నారు. ఆ ఫోన్‌ ఏ ప్రదేశంలో ఉందో? ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుసుకోచ్చని అంటున్నారు. అవేంటో.. చూద్దాం.
 
ఫీచర్స్‌ ఉపయోగిస్తేనే..
ఆండ్రాయిడ్‌ ఫోనైనా, యాపిల్‌ డివైసైనా.. లేటెస్ట్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌ వినియోగించుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫీచర్స్‌ను ఉపయోగిస్తేనే పొగొట్టుకున్న స్మార్ట్‌ ఫోన్ల ఆచూకీ దొరికే అవకాశం ఉంటుంది. గూగుల్‌ అందిస్తున్న ఫీచర్స్‌తో ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోవడంతోపాటు ఫోన్‌ను లాక్‌ కూడా చేయవచ్చు. ఇందుకోసం స్మార్ట్‌ ఫోన్‌లోని సెక్యూరిటీ సర్వీస్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
 
ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌..
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారు తమ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ ఎనేబుల్‌ చేసుకోవల్సి వుంటుంది. యాపిల్‌ వినియోగదారులైతే ఫైండ్‌ మై ఫోన్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవల్సి వుంటుంది. ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకోవాలంటే.. googlesettings security - android device manager- allow remote lock, erase and switch it on అనే ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవల్సి వుంది. ఇలా ఎనేబుల్‌ చేసుకున్నాక.. మీ ఫోన్‌ ఒకవేళ పోగొట్టుకుంటే గూగుల్‌ అకౌంట్‌లో లాగిన్‌ అయి.. మీ ఫోన్‌ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అయితే.. పోగొట్టుకున్న ఫోన్‌ ఆన్‌ చేసి ఉంటేనే ఈ ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌తో సులువుగా కనుగొనే అవకాశం వుంటుంది.
 
స్మార్ట్‌ ఫోన్‌ పోగొట్టుకుంటే..
స్మార్ట్‌ఫోన్‌ ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఏదైనా ప్రాంతంలో మర్చిపోయినా వెంటనే ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ యాప్‌ను వినియోగించుకోవడం లేదా ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ వెబ్‌సైట్‌లోకి గూగుల్‌ అకౌంట్‌ సహాయంతో లాగిన్‌ అవ్వడం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది. ఫోన్‌ ఆన్‌ చేసి ఉంటే డివైస్‌ లొకేషన్‌ మ్యాప్‌లో కనిపిస్తుంది. ఫోన్‌ ఆన్‌ చేసి వుంటేనే లోకేషన్‌ను ట్రేస్‌ చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ సహాయంతో పొగొట్టుకున్న ఫోన్‌ డివైస్‌ను ట్రేస్‌ చేస్తే మూడు ఆప్షన్‌లు కనబడతాయి. అవే.. రింగ్‌, లాక్‌, ఎరేజ్‌.
  • రింగ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుంటే ఫోన్‌ ఫుల్‌ వాల్యూమ్‌తో ఐదు నిముషాల పాటు బిగ్గరగా రింగ్‌ అవుతుంది.
  • లాక్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుంటే రిమోట్‌ విధానాన్ని ఉపయోగించి మిస్‌ అయిన ఫోన్‌ను లాక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • ఎరేజ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే ఫోన్‌ సెట్టింగ్స్‌ సహా మ్యూజిక్‌, ఫోటోలు, వీడియోలు, యాప్స్‌, కాల్‌ డేటా మొత్తం డిలీట్‌ అవుతంది.
యాపిల్‌ ఫోన్ అయితే..
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌లలో ఎలా అయితే ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ పనిచేస్తోందో అదే విధంగా యాపిల్‌ ఫోన్‌లలో ఫైండ్‌ మై ఐ ఫోన్‌ ఫీచర్‌ పనిచేస్తుంది. అయితే.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ తరహాలో యాపిల్‌ ఫోన్‌లలో ఫైండ్‌ మై ఐఫోన్‌ యాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవల్సిన అవసరం ఉండదు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానంతో పనిచేసే ఈ యాప్‌ ఇన్‌బిల్ట్‌గానే యాక్టివేట్‌ అయి వుంటుంది. ఐక్లౌండ్‌.కామ్‌లో లాగిన్‌ అయి ఫోన్‌ పొగొట్టుకున్నా, ఎక్కడైనా మర్చిపోయినా.. ఐఫోన్‌ కొనేటప్పుడు మీకు కేటాయించిన ఐడీ సహయంతో పట్టుకోవచ్చు. ఐక్లౌడ్‌.కామ్‌లోకి లాగిన్‌ అయితే స్ర్కీన్‌పై ఫైండ్‌ ఐ ఫోన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌లోకి వెళ్లి మీ డివైస్‌ను ఎంపిక చేసుకుంటే ఫోన్‌ లొకేట్‌ అవుతుంది. ఫోన్‌ ఆన్‌లో వున్నట్లయితేనే ఫైండ్‌ మై ఐ ఫోన్‌ మీరు మర్చిపోయిన, పోగొట్టుకున్న ఫోన్‌ను ట్రేస్‌ చేసే అవకాశం వుంటుంది. ఫోన్‌ ట్రేస్‌ అయిన వెంటనే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మాదిరిగానే రింగ్‌, ఎరేజ్‌, లాక్‌ ఆప్షన్‌లను ఎంపిక చేసుకుని డేటా ఎరేజ్‌ చేయడం, రింగ్‌ చేయడం, లాక్‌ చేసే అవకాశాలు వుంటాయి.
 
గూగుల్‌ డ్యాష్‌ బోర్డ్‌
గూగుల్‌ డ్యాష్‌ బోర్డ్‌ ద్వారా కూడా మీ ఫోన్‌ను ట్రేస్‌ చేయవచ్చు. ఇందుకోసం గూగుల్‌ డ్యాష్‌ బోర్డు ఓపెన్‌ చేసి మన ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వార్డ్‌తో లాగిన్‌ అయితే.. మన ఫోన్‌ ఎక్కడుందో లొకేట్‌ చేస్తుంది. అంతేకాకుండా.. ఆ ఫోన్‌లో ఏయే వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేశారు, ఆ ఫోన్‌ నుంచి ఎవరికి కాల్‌ చేశారు, ఎవరికి మెసేజ్‌ చేశారో కూడా తెలసుకోవచ్చు. ఇక్కడి నుంచే మీ ఫోన్‌ను లాక్‌ చేయవచ్చు. డేటాను ఎరేజ్‌ చేయవచ్చు. ఇందుకోసం.. ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ ఫీచర్‌లోలా ప్రత్యేకంగా సెట్టింగ్‌ ఎనేబుల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.

Posted On: 22 Jul 2017 Total Views: 436

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరిక...

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరికింది ఎవరో ...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్ప‌టికే సిట్ నోటీసులు అందుకున్న 12 మంది సెల‌బ్రెటీలు రోజుకొక్క‌రు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే... సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ నటులు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ...

29 Jul 2017


గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

మీలో ఎవరు కోటీశ్వరుడు … అప్పటికి తెలుగు తెరపై నెం1 షో. నాగార్జున ఆ షోని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు. ఆ షో కాస్త మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడగానే, అంచనాలు ఇంకా పెరిగాయి. నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని, టీఆర్పి డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఊహించుకుంది స...

28 Jul 2017

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, యుంగ్ డైరెక్ట‌ర్ బాబీ డైరెక్ష‌న్ లో, క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా జై లవ కుశ సినిమా వ‌స్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకో...

26 Jul 2017

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ...

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ‌ర‌ణ్..

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ న‌డుస్తున్నాడు. యాక్టింగ్ లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న చ‌ర‌ణ్ సేవా కార్య‌క్ర‌మాల‌లోను తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నాడు . గ‌తంలో పలు మార్లు అనేక సేవా కా...

25 Jul 2017

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి &lsq...

25 Jul 2017