గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియా
తారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌
ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు
దర్శకత్వం: సంపత్‌ నంది

ధనం మూలం ఇదత్‌ జగత్‌ అనే సామెత అందరం వినే ఉంటాం. ఈ ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుంది అనే ప్రధానాంశంతో రూపొందిన చిత్రం 'గౌతమ్‌నంద'. ఇప్పటి వరకు యాక్షన్‌ హీరోగా ఇమేజ్‌ సంపాదించుకున్న గోపీచంద్‌ తొలిసారి స్టైలిష్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. భారీ బడ్జెట్‌తో రూపొందిన గౌతమ్‌ నందలో గోపీచంద్‌ డబుల్‌ షేడ్‌లో నటించాడు. దర్శకుడు సంపత్‌ నంది రమణమహర్షి పుస్తకంలోని ఓ లైన్‌ ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నాడు. ఓ డబ్బున్నవాడు అసలు తన జీవిత ప్రయాణంలో ఏం పొగొట్టుకున్నాడు? దాన్ని తిరిగి ఎలా సంపాదించుకున్నాడు? చివరకు ఏం సాధించాడు? గౌతమ్‌నందగా గోపీచంద్‌ ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..

కథ:
బిలియనీర్‌ విష్ణు ప్రసాద్‌(సచిన్‌ ఖేడ్‌ఖర్‌)కి ఒకే ఒక వారసుడు ఘట్టమనేని గౌతమ్‌(గోపీచంద్‌). గౌతమ్‌కు బిజినెస్‌ బాధ్యతలు అప్పగించాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. గౌతమ్‌ స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తుంటాడు. విష్ణు ప్రసాద్‌ స్నేహితుడి(ముకేష్ రుషి) కూతురు ముగ్ధ(కేథరిన్‌), గౌతమ్‌ను ప్రేమిస్తుంటుంది. ఓ పార్టీలో తాగిన మత్తులోని గౌతమ్‌ అక్కడ పనిచేసే బేరర్‌(తనికెళ్ళ భరణి)ని కొడతాడు. నీ తండ్రి సంపాదించిన పేరుతో బ్రతకడం కాదు, అసలు నువ్వెవరో కనుక్కో అని బేరర్‌ చెప్పడంతో గౌతమ్‌ జీవితం మలుపు తిరుగుతుంది. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని బయలుదేరిన గౌతమ్‌కు తన పోలికలతో ఉన్న నంద(గోపీచంద్‌) కనపడతాడు. నంద హైదరాబాద్‌లోని బోరబండ మురికివాడల్లో ఉంటాడు. తనకేమో బాగా డబ్బు సంపాదించాలనే కోరికుంటుంది. నంద గురించి తెలుసుకున్న గౌతమ్‌ అతని స్థానంలో బోరబండ వెళితే, గౌతమ్‌ స్థానంలో నంద బిలియనీర్‌ ఇంటికి చేరుతాడు.

గౌతమ్‌ అనుభవించే సుఖాలను అనుభవిస్తుంటాడు నంద. స్ఫూర్తి నందను ఇష్టపడుతుంటుంది. మరోవైపు గౌతమ్‌, పేదవారి బ్రతుకులు ఎలా ఉంటాయి. అమ్మ, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు. కథ ఇలా సాగిపోతుండగా గౌతమ్‌పై రెండు సార్లు ఎవరో ఎటాక్‌ చేస్తారు. దాంతో గౌతమ్‌కి తననెవరు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుని చేసే ప్రయత్నంలో గౌతమ్‌కు తెలిసే నిజం ఏమిటి? చివరకు గౌతమ్‌, నందులేమౌతారు? కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్‌ పాయింట్స్‌:
సినిమాటోగ్రఫీ
నటీనటుల పనితీరు
మేకింగ్‌ వేల్యూస్‌

మైనస్‌ పాయింట్స్‌:
సంగీతం
బలహీనమైన కథ
కామెడి లేదు

విశ్లేషణ:
ఇందులో ముందుగా నటీనటులు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, గోపీచంద్‌ గురించి చెప్పుకోవాలి. గోపీచంద్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. బిలియనీర్‌ తనయుడు గౌతమ్‌, దిగువ మధ్య తరగతి యువకుడు నందుగా చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. హన్సిక మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటించింది. కేథరిన్‌ బాగా డబ్బున్న అమ్మాయిగా కనపడింది. బికినీ అందాలతో కుర్రకారు మనసుని దోచేసింది. వెన్నెల‌ కిషోర్, తీన్మార్ స‌త్తి కామెడి ఓకే. అనుకున్న రేంజ్‌లో కామెడి వ‌ర్క‌వుట్ కాలేదు. క‌థ‌లో ప్రేక్ష‌కుల‌ను విర‌గ న‌వ్వించే కామెడి క‌న‌ప‌డ‌దు. ఇక తండ్రి పాత్రలో చంద్రమోహన్‌, తనికెళ్ళభరణి, సీత, విలన్స్‌గా నటించిన ముకేష్‌రుషిి, సెక్యూరిటీ ఆఫీసర్‌ నికితన్‌ ధీర్‌ సహా అందరూ వారివారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నిషియన్స్‌ విషయానికి వస్తే దర్శకుడు సంపత్‌ నంది తెరపై చూపించాలనుక్ను పాయింట్‌ చిన్నదే. కానీ ప్రతి సీన్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. సౌందర్‌రాజన్‌ సినిమాటోగ్రఫీ సినిమాలో మెయిన్‌ హైలైట్‌.

సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు. జిందగి నా మిలేగా దుబారా చిత్రంలో తీసిన యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయి. థమన్‌ అందించిన ట్యూన్స్‌లో బస్తీపై వచ్చే సాంగ్‌ బావుంది. మిగిలిన అన్నీ పాటలు ఒకే. ట్యూన్స్‌లో సాహిత్యాన్ని నేపథ్య సంగీతం డామినేట్‌ చేసింది. ఇక సెకండాఫ్‌లో నంద కనపడుతున్నపుపడు వినిపించే నేపథ్య సంగీతం బావుంది. దర్శకడు సంపత్‌ నంది కథ పరంగా ఎక్కడా కొత్తదనాన్ని చూపించలేదు. ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు అటు, ఇటు మారడం అనే కాన్సెప్ట్‌ను ఎప్పటి నుండో చూస్తున్నాం. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనపడుతుంది. వాన ఫైట్‌ బావుంది. పేర్లలోనే తేడా పేపర్‌ ఒకటే, బలిసినోడుకి, లేనిలోడుకి ఓకే బస్టాండ్‌ కానీ బ్రతులకే వేరు...వంటి డైలాగ్స్‌ మెప్పిస్తాయి. సెండాఫ్‌లోని చివరి 30 నిమిషాల కథ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

రేటింగ్‌: 2.5/5


Posted On: 28 Jul 2017 Total Views: 627

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరిక...

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరికింది ఎవరో ...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్ప‌టికే సిట్ నోటీసులు అందుకున్న 12 మంది సెల‌బ్రెటీలు రోజుకొక్క‌రు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే... సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ నటులు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ...

29 Jul 2017


గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

చిరంజీవి ని దారుణంగా ఓడించిన ఎన్టీఆర్

మీలో ఎవరు కోటీశ్వరుడు … అప్పటికి తెలుగు తెరపై నెం1 షో. నాగార్జున ఆ షోని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు. ఆ షో కాస్త మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడగానే, అంచనాలు ఇంకా పెరిగాయి. నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని, టీఆర్పి డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఊహించుకుంది స...

28 Jul 2017

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, యుంగ్ డైరెక్ట‌ర్ బాబీ డైరెక్ష‌న్ లో, క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా జై లవ కుశ సినిమా వ‌స్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకో...

26 Jul 2017

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ...

మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న రామ్ చ‌ర‌ణ్..

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ న‌డుస్తున్నాడు. యాక్టింగ్ లో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న చ‌ర‌ణ్ సేవా కార్య‌క్ర‌మాల‌లోను తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నాడు . గ‌తంలో పలు మార్లు అనేక సేవా కా...

25 Jul 2017

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

జూనియర్ ముందు నిలవలేక పోతున్న మహేష్..

రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి &lsq...

25 Jul 2017