మహాత్ముడే ఉంటే ఈ ‘నిషా’ ఉండేదా!

మహాత్ముడే ఉంటే ఈ ‘నిషా’ ఉండేదా!

‘కరమ్‌చంద్‌ నేడుండినా ఈ నిషా బంద్‌ కాకుండేనా అన్నాడు ఒక కవి. నిజంగా గాంధీ మహాత్ముడే నేడు ఉంటే దేశంలో విజృంభించి, మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ మద్యం రక్కసిని చూసి ఎంత ఆవేదన చెందేవారో. ఏ లోకంలో ఉన్నారేమోకానీ పాలకులే ఆదాయంకోసం మద్యం అమ్మకాలు, విక్రయాలను ప్రోత్స హిస్తున్నడాన్ని చూసి ఎంతటి క్షోభ అనుభవిస్తున్నారో. మద్య నిషేధం అనేది జాతికి మహాత్ముడు అందించిన అమృత సందేశం. అందులో మరో వాదనకు తావ్ఞలేదు. స్వాతంత్య్రం రాగానే ఎంతో ముందుచూపుతో ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్న మద్యపానాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఆయన తపించారు.

గాంధీ మహాత్ముని జయంతులు, వర్ధంతులు ప్రతియేటా తప్పకుండా దేశవ్యాప్తంగా జరుపుకునే పాలకులు ఆయన సందేశాన్ని తుంగలో తొక్కడం బాధాకరం. మద్యాదాయమే మహాప్రసాదంగా భావిస్తూ మద్యం అమ్మకాలను, వినియోగాన్ని విస్తరిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడం అత్యంత దురదృష్టకరం. మద్యంవల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎన్ని లక్షల కుటుంబాలు ఈ మద్యం రక్కసి కోరల్లో చిక్కుకుని చితికిపోతున్నాయో పాలకులకు తెలియంది కాదు. కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంపై మద్యం పంజా విసురుతుందనేది తెలియంది కాదు. మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు అన్నీ ఇన్నీ కావ్ఞ. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలలో నిందితుల్లో తొంభైశాతం పైగా మద్యం మత్తులో ఉన్నవారే. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులో కానీ, ఆ తర్వాత కానీ జరుగుతున్న అత్యాచారాలు, హత్యల్లో నిందితులు ఈ మత్తులో తూగుతున్న వారే. నిన్న తాజాగా జగిత్యాల జిల్లాలో పదోతరగతి చదువ్ఞతున్న ఇద్దరు యువకులు ఒకే యువతిని ప్రేమించడంతో ఏర్పడిన వివాదంలో మద్యం పూర్తిగా సేవించి ఒకరిపై ఒకరు పెట్రోలు పోసుకుని కాల్చుకుని చనిపోయిన సంఘటన దిగ్భ్రాంతి కలిగిస్తున్నది.
పదోతరగతి చదువుతున్న ఆ మైనర్‌ బాలురకు మద్యం ఎవరు అమ్మారు, ఎక్కడ అమ్మారు, అసలు ఎక్కడ అలవాటుపడ్డారు? అన్నీ ప్రశ్నలే. ఇటీవల కాలంలో నగరాల్లో పబ్‌లు, పట్టణాలు, గ్రామాల్లో బ్రాందీ షాపుల్లోనే తాగేందుకు అనుమతినివ్వడం, ఇక బెల్ట్‌ షాపులు ఒకటేమిటి ఎక్కడపడితే అక్కడ మద్యం దొరకని ప్రాంతమంటూ లేకుండాపోయింది. మంచినీళ్లు దొరకని గ్రామాలున్నాయేమోకానీ మద్యం, అక్రమ సారా దొరకని ప్రదేశాలు లేవని చెప్పొచ్చు.

ప్రభుత్వం చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ మద్యం సేవించిన వారిని బహిష్కరించే స్థాయికి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారంటే ఆనాటి పాలకులు ఎంత త్రికరణశుద్ధిగా మద్యాన్ని పారద్రోలడానికి ప్రయత్నం చేశారో అర్థమవ్ఞతుంది. ఆనాడు తాగుబోతులంటేనే ప్రజల్లో ఒక రకమైన అసహ్యభావం ఏర్పడే పరిస్థితులు కల్పించా రు. తాగుబోతులైన యువకులకు పెళ్లి కావడం కష్టతరంగా మారింది. మద్యం రక్కసికి ఇక తావ్ఞలేదనే పరిస్థితి కల్పిం చారు. కానీ రానురానూ మారిన పరిస్థితుల్లో ఆదాయాన్ని కోల్పోవడం సమంజసం కాదనే వాదన తీసుకొచ్చి అందు లోనూ కొత్తగా విలీనమైన తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లోనే మద్యం వినియోగం ఉండటం తదితర కారణాలతో మద్యం వినియోగానికి తెరలేపారు. రకరకాల వాదనలు, కారణాలు చూసినా ఆదాయమే ఏకైక లక్ష్యం అనేది అందరికీ తెలిసిం దే. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర పాలకులు ఆలోచించాలి. ఏదో ఒక రాష్ట్రంలో నిషేధంవిధిస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఏరులై పారుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. తాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు తప్పవని, మైనర్లకు మద్యం సరఫరాచేస్తే బార్లపై కేసులుంటాయని చట్టాలు చేస్తున్నారు.

కానీ అమ లేది? జగిత్యాలలో పదో తరగతి విద్యార్థులు మద్యంమత్తు లో పెట్రోలు పోసుకుని కాల్చుకున్న సంఘటనతోనైనా కనువిప్పు కలగాలి. వీటన్నింటికీ మద్యనిషేధం ఒక్కటే పరిష్కారమన్నది పాలకులు తొందరగా గ్రహించాలి.

Posted On: 02 Oct 2018 Total Views: 29

స్పెయిన్‌ టూర్‌లో ‘అక్కినేని ఫ్యామిలీ

స్పెయిన్‌ టూర్‌లో ‘అక్కినేని ఫ్యామిలీ

కింగ్‌ నాగార్జున ఎన్ని సినిమాలు చేసినా.. వయసు ఎంత మీద పడుతున్నా ఇది తనకు మాత్రం వర్తించదు అనేలా లైఫ్‌ని ఎలా లీడ్‌ చేయాలో చాలా నేర్చుకోవచ్చు..దేవవాస్‌ విడుదలకు ఒక్కరోజు ముందు హాలిడే కోసం వెళ్లిన నాగ్‌ నేరుగా తన కొడుకు నాగచైతన్యకోడలు సమంతతో కలిసి జాయిన్‌ అయ్యారు.. తానొక్క...

05 Oct 2018

పెట్రోల్‌ ధరలపై కేంద్ర సంచలన నిర్ణయం…

పెట్రోల్‌ ధరలపై కేంద్ర సంచలన నిర్ణయం…

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఎట్టకేలకు సామాన్యడికి భారీ ఊరట కల్పించింది. ఇంధనాలపపై వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ డ్యూటిని 1.50 మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. అయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సైతం ఇంధన ధరలను రూ.1 మేర తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో...

05 Oct 2018

ముగ్గురికి భౌతికశాస్త్రంలో నోబెల్‌

ముగ్గురికి భౌతికశాస్త్రంలో నోబెల్‌

స్టాక్‌హోమ్‌: ఈ రోజు నోబెల్‌ పురస్కారాన్ని భౌతికశాస్త్రం విభాగంలో ముగ్గురికి కలిపి కమిటీ ప్రకటించింది. ఆర్థర్‌ ఆష్కిన్‌, గిరార్డ్‌ మౌరు, డోనా స్ట్రిక్‌ల్యాండ్‌ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు లేజర్‌ భౌతికశాస్త్రంలో వీరు చేసిన నవ కల్పనకుగాను ఈ పురస్కారాన్ని ప...

02 Oct 2018

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరిక...

మెగా ఫ్యామిలీ నుండి డ్రగ్స్ కేసులో దొరికింది ఎవరో ...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌ణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్ప‌టికే సిట్ నోటీసులు అందుకున్న 12 మంది సెల‌బ్రెటీలు రోజుకొక్క‌రు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే... సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సినీ నటులు సినిమా ఇండ‌స్ట్రీలో డ్రగ...

29 Jul 2017

గౌతమ్‌నంద రివ్యూ

గౌతమ్‌నంద రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియాతారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, ముఖేష్‌ రుషి, నికిత‌న్ ధీర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్‌, తీన్‌మార్ స‌త్తి తదితరులుసంగీతం: ఎస్...

28 Jul 2017